Smart phones: పూరీ ఆలయంలోకి స్మార్ట్‌ఫోన్లపై పూర్తి నిషేధం

ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోకి స్మార్ట్‌ఫోన్లు తీసుకెళ్లడంపై అధికారులు నిషేధం విధించారు. గతంలో కేవలం భక్తులపై మాత్రమే ఈ రకమైన ఆంక్షలు అమలుచేయగా.. ఇకపై అందరికీ ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలుచేయనున్నారు.

Published : 16 Dec 2022 01:49 IST

పూరీ: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథస్వామి(Jagannath Temple) ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 13వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలోకి స్మార్ట్‌ఫోన్లు(Smart phones) తీసుకెళ్లడంపై పూర్తిస్థాయిలో నిషేధం(Ban) విధించారు. వచ్చే ఏడాది నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్లపై నిషేధాన్ని జనవరి 1వ తేదీ నుంచే అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. గతంలో భక్తులకు మాత్రమే ఈ ఆంక్షల్ని అమలు చేసిన యంత్రాంగం.. ఇప్పుడు ఆ పరిమితులను పోలీస్‌ సిబ్బందితో పాటు అందరికీ వర్తింపజేస్తున్నట్టు శ్రీ జగన్నాథ ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ఫోన్లను డిపాజిట్‌ చేస్తారని పేర్కొన్నారు. ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు శ్రీ జగన్నాథ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎస్‌జీటీఏ) చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ వీర్‌ విక్రమ్‌ యాదవ్‌ మీడియాకు చెప్పారు. అధికారులు, సేవకులు ఫొటోలు, వీడియోగ్రఫీ ఫీచర్లు లేని సాధారణ ఫోన్లు మాత్రం తీసుకొని వెళ్లొచ్చన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని