పదవుల కోసం నేతలు పోటీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం గాఢనిద్రలో..!: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే

కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం నియామకాలపై కాంగ్రెస్‌ నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శలు గుప్పించారు.

Published : 07 Jul 2024 16:44 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పు, ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్‌లో నేతల మధ్య వాగ్వాదం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ హెచ్చరించినా నాయకులు మాత్రం మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రమంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం గాఢనిద్రలో ఉంది. ప్రజలను పట్టించుకోవడం మానేసింది. హస్తం పార్టీ నేతలంతా పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని అని చెప్పడంలో సందేహం లేదు. వివిధ సమస్యలతో రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి గురించి ఆలోచించే సమయం మాత్రం ప్రభుత్వానికి లేదు’’ అని విమర్శించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతుల క్షీణించాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలి. ప్రజల భవిష్యత్తును రక్షించాలి’’ అని ఆమె కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని