Published : 16 May 2022 01:55 IST

Chintan Shivir: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి?

ఉదయ్‌పుర్‌ సదస్సులో చర్చించిన సీడబ్ల్యూసీ

దిల్లీ: చింతన శిబిరం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఉదయ్‌పుర్‌లో నిర్వహించిన సదస్సులో పలు కీలక సంస్కరణలకు నడుం బిగించింది. నవ సంకల్ప్‌ పేరుతో తీసుకువచ్చే ఈ మార్పుల్లో ‘ఒకే కుటుంబం ఒకే టికెట్‌, ఒకే వ్యక్తికి ఒకే పదవి’ అంశాన్ని కీలకంగా పేర్కొంది. ముఖ్యంగా యాభైఏళ్లలోపు వయసువారికి పార్టీలో ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. మరోవైపు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల (EVM)పై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) ప్రముఖంగా చర్చించింది. తమ పార్టీ అధికారాంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలికి పేపర్‌ బ్యాలెట్‌ తీసుకువచ్చేందుకు సూచనప్రాయం ఆమోదం తెలిపిన సీడబ్ల్యూసీ.. ఇందుకు సంబంధించి భావసారుప్యత గల పార్టీలతో చర్చించాలని నిర్ణయించింది.

చింతన్‌ శిబిర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయాలు..

* ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదం, మొత్తం 20 ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ గ్రీన్‌ సిగ్నల్‌

* ఒక కుటుంబానికి ఒకే టికెట్‌పై ఏకాభిప్రాయం. అయితే, పార్టీలో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు కుటుంబ సభ్యులు, బంధువులకు టికెట్‌ ఇచ్చేందుకు అవకాశం

* ఒకే పదవిలో ఒకరు ఐదేళ్లకంటే ఎక్కువగా కొనసాగకూడదు. తద్వారా కొత్తవారికి అవకాశం కల్పించడం

* పార్టీలో కొత్తగా మూడు విభాగాలు.. ప్రజా సమస్యలు, ఎన్నికల మేనేజిమెంట్‌, జాతీయస్థాయిలో శిక్షణకు వేర్వేరు విభాగాలు

ప్రజలతో మమేకం అయ్యేందుకు పాదయాత్రలు, జనతా దర్బార్‌లు నిర్వహించడం

* దేశవ్యాప్తంగా పర్యటించడంలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’. ఇందుకు అక్టోబర్‌ 2 తేది ఖరారు

కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సహాయంగా కమిటీల ఏర్పాటు. పార్టీలో సంస్కరణల కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

పార్టీలో యువత ప్రాతినిధ్యం పెంచాలని సీడబ్ల్యూసీ నిర్ణయం

* బ్లాక్‌ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు 50శాతం యువత ఉండాలి. ఇందులో భాగంగా యాభై ఏళ్ల వయసు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు చోటు

ప్రియాంకగాంధీ బాధ్యతలు పెంచడంపైనా సీడబ్ల్యూసీలో చర్చ

పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయాలన్న జీ23 నేతల సూచనకు అంగీకారం

ఈవీఎంలపై రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రశ్నలు లేవనెత్తడంపై చర్చించిన సీడబ్ల్యూసీ.. తీర్మానానికి ఆమోదం

* బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరగాలని కాంగ్రెస్‌ ప్రధాన డిమాండ్‌. ఇందుకు సంబంధించి భావసారూప్యత గల పార్టీలతో చర్చించాలని నిర్ణయం

పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలికి, పేపర్‌ బ్యాలెట్‌ తీసుకువచ్చేందుకు సూచనప్రాయంగా ఆమోదం

70ఏళ్లు దాటిన వారు ఎన్నికల్లో పోటీ చేయొద్దనడంపై కుదరని ఏకాభిప్రాయం

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని