Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
చైనా విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న విధానాలను కాంగ్రెస్ విమర్శించింది. అలాగే రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది.
దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాన్ని కాంగ్రెస్(Congress) మరోసారి దుయ్యబట్టింది. ప్రభుత్వ వ్యూహాన్ని డీడీఎల్‌జే(DDLJ)తో పోల్చింది. చైనాతో సరిహద్దు వివాదంపై వాస్తవాలు వెల్లడించకుండా దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని, తమ చర్యలను సమర్థించుకుంటోందని విమర్శలు గుప్పించింది. DDLJకు హస్తం పార్టీ చెప్పిన అర్థం-Deny(తిరస్కరించడం), Distract(దృష్టి మరల్చడం), Lie(అసత్యాలు), Justify(సమర్థించుకోవడం).
‘ఇటీవల విదేశాంగ మంత్రి జై శంకర్(S jaishankar) చేసిన వ్యాఖ్యలు.. చైనా(China)తో వివాదం విషయంలో మోదీ ప్రభుత్వ విఫల విధానాలపై దృష్టి మరల్చడం వంటిదే. తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం.. 2020 నుంచి తూర్పు లద్దాఖ్‌లో మొత్తం 65 గస్తీ పాయింట్లలో భారత్ 26 పాయింట్లను కోల్పోయింది. నిజానికి 1962కు ఇప్పటికీ పోలికే లేదు. అప్పుడు భారత్ తన భూభాగాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేసింది. 2020లో మాత్రం చైనా దురాక్రమణను వ్యతిరేకించకుండా బలగాలను ఉపసంహరించుకుంటోంది. దాంతో భారత్ వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయింది’ అని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి.. మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘ఒబామా ప్రభుత్వంలో అంబాసిడర్‌గా పనిచేసిన వ్యక్తి(జై శంకర్‌ను ఉద్దేశించి).. అక్కడి విపక్ష నేతలను కలిసే ఉంటారు. అలాంటి వ్యక్తి నుంచి ఈ మాటలు రావడం ఆశ్చర్యంగా ఉంది. విపక్ష నేతలు ఇతర దేశాలకు చెందిన దౌత్యవేత్తలను కలవకూడదా..?’ అని ప్రశ్నించారు.
సరిహద్దుల్లో భారత భూభాగాన్ని చైనా (China) ఆక్రమించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్ని ఇదివరకు విదేశాంగ మంత్రి తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వారు ఆరోపిస్తున్న భూభాగం 1962లోనే ఆక్రమణకు గురైందని తెలిపారు. 2017లో రాహుల్ గాంధీ చైనా (China) రాయబారిని కలవడంపైనా విమర్శలు చేశారు. చైనా దురాక్రమణపై ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే తాను చైనా రాయబారుల దగ్గరకు వెళ్లనని పరోక్షంగా రాహుల్ చర్యను ఎద్దేవా చేశారు. మన దేశ సైనిక నాయకత్వం దగ్గర సందేహాలను నివృత్తి చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ స్పందన వచ్చింది.
చైనా ప్రతినిధులను కలవడంపై అప్పట్లో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కీలక అంశాలపై సమాచారం తెలుసుకోవడం నా విధి అని అన్నారు. ఈ క్రమంలోనే చైనా రాయబారి, భూటాన్ రాయబారి సహా మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను కలిశానని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
-
World News
నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం!
-
Crime News
Vijayawada: విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు