Train Collision: మోదీ సర్కార్‌ వైఫల్యమే.. రైలు ప్రమాదానికి కారణం: ఖర్గే విమర్శలు

పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రమాదానికి మోదీ సర్కార్‌ చేసిన వైఫల్యమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. 

Published : 17 Jun 2024 16:16 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని డార్జిలింగ్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ (Congress) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మోదీ సర్కార్‌ వైఫల్యమే కారణమని ఆరోపించింది. పదేళ్ల పాలనలో రైల్వేశాఖను భాజపా దుర్వినియోగం చేసిందని మండిపడింది.

‘‘పదేళ్లుగా మోదీ సర్కార్‌ రైల్వే మంత్రిత్వశాఖను పూర్తిగా దుర్వినియోగం చేసింది. ఆ శాఖను ప్రచార వేదికగా మార్చేసింది. నేడు జరిగిన ఈ ప్రమాదం వాస్తవానికి దర్పణం పడుతోంది. దీనిపై బాధితుల తరఫున పోరాడుతాం. మోదీ ప్రభుత్వాన్ని దీనికి జవాబుదారిని చేస్తాం’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

‘‘పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం అనేక మందిని బలితీసుకొంది. పలువురిని తీవ్రంగా గాయపరిచింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ‘ఎక్స్‌ వేదికగా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ

కాగా.. బెంగాల్‌లో ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని