Navjot Singh Sidhu: జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..!
ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం. ఏడాది శిక్ష పడినప్పటికీ.. నెలన్నర ముందే ఆయన బయటకు రానున్నారు.
చండీగఢ్: మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో పంజాబ్ (Punjab) కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. గతేడాది మే నుంచి జైల్లోనే ఉన్న ఆయన.. ఏప్రిల్ 1న బయటకు రానున్నారు. ఈ విషయాన్ని సిద్ధూ తరఫు న్యాయవాది వెల్లడించారు. సత్ప్రవర్తన కలిగిన దోషి శిక్ష నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. శిక్ష తగ్గింపునకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ (Invasive Cancer) బారిన పడినట్లు ఇటీవల వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌లో వేదికగా స్వయంగా వెల్లడించారు. అయితే, ఇటువంటి ఆపద సమయంలో భర్త కోసం ఎంతో వేచిచూస్తున్నానని అన్నారు. జైల్లో ఉన్న సిద్ధూ కంటే బయట ఉన్న తానే ఎక్కువ బాధను అనుభవిస్తున్నానంటూ నవ్‌జ్యోత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే, 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంలో జరిగిన ఘర్షణలో 65ఏళ్ల గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్ధూతోపాటు రూపిందర్ సింగ్‌పై దాడి చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై పలు కోర్టుల్లో విచారణ ముగిసిన అనంతరం.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు 2022 మే నెలలో తీర్పువెలువరించింది. దీంతో మే 20న సిద్ధూ కోర్టుముందు లొంగిపోయిన ఆయన్ను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు