ఆరోగ్య మంత్రిని బలిపశువు చేశారు: మల్లికార్జున ఖర్గే

కరోనా కట్టడిలో విఫలమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తాను బాధ్యత వహించకుండా ఆరోగ్య మంత్రిని బలిపశువును చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు....

Published : 20 Jul 2021 22:11 IST

దిల్లీ: కరోనా కట్టడిలో విఫలమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తాను బాధ్యత వహించకుండా గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హర్షవర్దన్‌ను బలిపశువుని చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్యసభలో కరోనాపై జరిగిన చర్చలో పాల్గొన్న ఖర్గే.. మోదీని నమ్మి ప్రజలు దీపాలు వెలిగించి, ప్లేట్లు మోగిస్తే ఆయన మాత్రం వారిని నిరాశపర్చారని మండిపడ్డారు. కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ఓ వైపు భౌతిక దూరం పాటించాలని హితవు పలుకుతూ.. మరోవైపు శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు నిర్వహించారని ఖర్గే విమర్శలు గుప్పించారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా వ్యాక్సిన్‌ విధానంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటికితోడు తాజాగా వెలుగు చూసిన పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతం, ధరల పెరుగుదల, రైతుల ఆందోళనలు వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలూ అట్టుడికిపోతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు