ఎన్నికల వేళ అవార్డులా?: కాంగ్రెస్‌

దిల్లీ: శాసనసభ ఎన్నికల సమయంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించడమేంటని కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా ప్రశ్నించారు. ఇటువంటి చర్యలతో భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారు ప్రతిదీ రాజకీయానికి అనుకూలంగా మల్చుకుంటుందని విమర్శించారు. గురువారం ఆయన ..

Updated : 02 Apr 2021 06:16 IST

దిల్లీ: శాసనసభ ఎన్నికల సమయంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించడమేంటని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఇటువంటి చర్యలతో భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారు ప్రతిదీ రాజకీయానికి అనుకూలంగా మల్చుకుంటోందని విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత రాజీవ్‌ శుక్లా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హీరో రజనీ అంటే ప్రతిఒక్కరూ గౌరవిస్తారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. ఆయనకు ఎప్పుడో ఈ అవార్డును ప్రదానం చేయాల్సిందన్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఏడాదే ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను భాజపా అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగుతోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎన్నికల్లో వారికి (భాజపా) తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని