National News: వివాదాస్పద ప్రాంతాలను సందర్శించనున్న సంగ్మా, హిమంత

దీర్ఘకాలిక సరిహద్దు వివాద పరిష్కార ప్రయత్నంలో భాగంగా అస్సాం, మేఘాలయ ముఖ్యమంత్రులు హిమంత బిశ్వశర్వ, కాన్రాడ్‌ సంగ్మా త్వరలో ఆ ప్రాంతాలను సంయుక్తంగా సందర్శించనున్నారు.

Published : 24 May 2023 23:13 IST

గువాహటి: దీర్ఘకాలిక సరిహద్దు వివాద పరిష్కార ప్రయత్నంలో భాగంగా అస్సాం, మేఘాలయ ముఖ్యమంత్రులు హిమంత బిశ్వశర్వ, కాన్రాడ్‌ సంగ్మా త్వరలో ఆ ప్రాంతాలను సంయుక్తంగా సందర్శించనున్నారు. మొత్తం 12 ప్రాంతాలపై వివాదం నెలకొనగా వాటిలో ఆరింటిని ఇప్పటికే పరిష్కరించుకున్నారు. కొంత సంక్లిష్టంగా ఉన్న మిగిలినవాటిపై ఏం చేయాలనే విషయమై బుధవారం గువాహటిలో ఇద్దరు సీఎంలు భేటీ అయి చర్చించుకున్నారు. చర్చలు, పరస్పర విశ్వాసం ద్వారా మిగతా ఆరు ప్రాంతాలపైనా ఒక నిర్ణయానికి రాగలమని విశ్వాసం వ్యక్తంచేశారు. పురోగతిని జులైలో సమీక్షించుకుంటామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు