హౌజింగ్‌ సోసైటీల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను పరిశీలించండి

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో హౌజింగ్‌ సోసైటీలు, రెసిడెంట్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్లను భాగం చేయడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ హైకోర్టు సూచించింది. ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకొని హౌజింగ్ సోసైటీలు వ్యాక్సినేషన్‌ క్యాంపులు చేపడితే ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడం సులభమవుతుందని హైకోర్టు

Published : 09 Jun 2021 00:10 IST

 దిల్లీ హైకోర్టు

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో హౌజింగ్‌ సోసైటీలు, రెసిడెంట్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్లను భాగం చేయడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ హైకోర్టు సూచించింది. ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకొని హౌజింగ్ సోసైటీల్లో వ్యాక్సినేషన్‌ క్యాంపులు చేపడితే ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడం సులభమవుతుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది మంచి సూచనే అయితే వెంటనే హౌజింగ్ సోసైటీల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టేలా చూడాలని తెలిపింది. ఇలాంటి క్యాంపుల నిర్వహణకు సంబంధిత అధికారులు అనుమతి నిరాకరిస్తే.. అందుకు గల కారణాన్ని స్టేటస్‌ రిపోర్టులో పొందుపర్చాలని న్యాయస్థానం పేర్కొంది.

రెసిడెంట్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అనుమతి ఇవ్వాలంటూ అమికస్‌ క్యూరీ, సీనియర్ న్యాయవాది రాజ్‌శేఖర్‌ రావు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్మీత్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘హౌజింగ్‌ సోసైటీ వ్యాక్సినేషన్‌ క్యాంపులను నిర్వహించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పలేం కానీ.. మా దృష్టిలో ఇలాంటి క్యాంపుల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఈ క్యాంపులకు అనుమతి ఇవ్వడం ద్వారా హౌజింగ్ సోసైటీల్లో ఉండే ప్రజలు సురక్షితంగా, సులువుగా టీకాలు తీసుకోగలరు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంపై స్టేటస్‌ రిపోర్టును జులై 7న కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని