Published : 09 Mar 2021 02:11 IST

ఒక్కరోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్‌! 

మధ్యప్రదేశ్‌లో మహిళకు అరుదైన గౌరవం

భోపాల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం లభించింది. మీనాక్షి వర్మ అనే కానిస్టేబుల్‌కు మధ్యప్రదేశ్‌లో ఒక్క రోజు హోంమంత్రిగా ఉండే గొప్ప ఛాన్స్‌ దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఆమెను ఒక్కరోజు హోంమంత్రిగా నియమించారు. ఆయనే స్వయంగా తన సీట్లో కూర్చోబెట్టి వినూత్నంగా గౌరవించారు. దీంతో ఆయన కార్యాలయంలో మీనాక్షి ఒక్కరోజు హోంమంత్రిగా విధులు నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె తెలుసుకున్నారు. అయితే, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా ఉన్న ఏడీజీపీ అశోక్‌ అవస్థీ అక్కడికి వచ్చి ఆమెను హోంమంత్రి సీట్లో చూసి షాక్‌ అయ్యారట. అనంతరం ఆమె ఒక్కరోజు హోంమంత్రిగా ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆమె చెప్పిన పనులు నిర్వర్తించారట. మరోవైపు, మీనాక్షి హోంమంత్రి నివాస కార్యాలయంలోనే సెక్యూరిటీ విధుల్లో ఉంటున్నారు.

మహిళలకు గౌరవం ఉన్నచోటే సంస్కృతి ఉద్ధరణ సాధ్యమవుతుందని హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. తన నివాస కార్యాలయంలో మీనాక్షి ఒక్కరోజు హోంమంత్రిగా విధులు నిర్వర్తించారని తెలిపారు. హోంమంత్రి కుర్చీలో కూర్చొని ప్రజల సమస్యలను వినడమే కాకుండా వాటిని పరిష్కరించేలా పలు సూచనలు ఇచ్చినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts