‘అక్కడ’ గ్రామం.. చైనా వితండ వాదం

తమ ప్రాంతంలో, తమ ప్రజల కోసం నిర్మాణాలు చేపట్టడం తప్పిదమేమీ కాదని చైనా బుకాయిస్తోంది.

Published : 21 Jan 2021 23:15 IST

బీజింగ్‌: కయ్యాలమారి చైనా మరోమారు భారత్‌తో వివాదానికి దిగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ భూభాగం తమదే అంటూ వితండవాదానికి దిగింది. ఈ ప్రాంతంలో చైనా ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలు ఇటీవల దుమారాన్ని సృష్టించాయి. కాగా, ఆ భూభాగం తమదే అని.. తమ ప్రాంతంలో, తమ ప్రజల కోసం నిర్మాణాలు చేపట్టడం అసాధారణం, తప్పిదమేమీ కాదని చైనా బుకాయిస్తోంది. ఓ మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు, ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి హువా చునియాంగ్‌ పై విధంగా స్పందించారు.

అది తమ దేశంలో అంతర్భాగమని.. ఈశాన్య భాగంలో ఉన్న రాష్ట్రమని భారత్‌ ఎన్నోమార్లు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక్కడి భూభాగంలో చైనా వందకు పైగా ఇళ్లు, రోడ్డు తదితర సౌకర్యాలతో ఓ గ్రామాన్ని నిర్మించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై భారత్‌ ఆచితూచి స్పందించింది. తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అన్ని పరిణామాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతామని ప్రకటన చేసింది.  తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ‘తగిన’ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

ఇదీ చదవండి..

చైనా గ్రామం.. వివరణ కోరిన చిదంబరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని