రామాలయ నిర్మాణంతో ‘రామ రాజ్యం’

అయోధ్యలో రామమందిరం ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న ఈరోజు చరిత్రాత్మకమైన రోజు అని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. ఆగస్టు 5న చరిత్రలో గుర్తిండిపోయే రోజుగా ఆయన అభివర్ణించారు....

Updated : 05 Aug 2020 12:17 IST

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌

అయోధ్య: అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న ఈరోజు చరిత్రాత్మకమైన రోజని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. రామమందిరం నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన అయోధ్యలోని ప్రముఖ దేవాలయం హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శిచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ...

‘‘భారత చరిత్రలో ఇది చరిత్రాత్మక రోజు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది. ఆ రోజును మనం సంబరంగా జరుపుకోవాలి. మందిర నిర్మాణంతో దేశంలో రామ రాజ్యానికి పునాది పడుతుందని విశ్వసిస్తున్నాను’’ అని  అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని