Corbevax: బూస్టర్‌ డోసుగా కార్బెవాక్స్‌.. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ తీసుకున్నవారు కూడా..!

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ రూపొందించిన కార్బెవాక్స్‌ టీకా బూస్టర్‌ డోసుగా అనుమతి పొందింది.......

Published : 05 Jun 2022 02:42 IST

దిల్లీ: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ రూపొందించిన కార్బెవాక్స్‌ టీకా బూస్టర్‌ డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) ఆమోదం తెలిపింది. అయితే గతంలో కొవిషీల్డ్‌ కానీ, కొవాగ్జిన్‌ తీసుకున్నప్పటికీ.. ఈ టీకాను బూస్టర్‌ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్‌ ఘనత సాధించింది.

డీసీజీఐ నిర్ణయంపై బయోలాజికల్‌-ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఆమోదం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. దేశంలోని బూస్టర్‌ డోసుల అవసరాన్ని పరిష్కరించే అవకాశం లభించింది’ అని పేర్కొన్నారు. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కార్బెవాక్స్‌ ప్రికాషనరీ డోసు పొందవచ్చు.

కార్బెవాక్స్‌ టీకాను ప్రస్తుతం 12 నుంచి 17ఏళ్ల పిల్లలకు అందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 10కోట్ల డోసులను బయోలాజికల్‌-ఇ సరఫరా చేసింది. మరోవైపు తేలికగా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్‌ వృథా అరికట్టేందుకుగానూ ఒక్క డోసును ఒకే వయల్‌ (బాటిల్‌)లో అందుబాటులో తీసుకువచ్చింది. కొద్దిరోజుల క్రితమే టీకా ధరను సంస్థ భారీగా తగ్గించింది. గతంలో డోసుకు రూ.840గా ఉండగా దీన్ని రూ.250 (పన్నులతో కలిపి)కి తగ్గించినట్లు గత నెలలో ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని