దేశంలో కరోనా టెస్టులు @ 20 కోట్లు!

కరోనా వైరస్‌ టెస్టుల్లో భారత్‌ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కొవిడ్‌-19 పరీక్షల సంఖ్య 20 కోట్ల మైలు రాయిని దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం వెల్లడించింది. 

Updated : 06 Feb 2021 17:42 IST

దిల్లీ: కరోనా వైరస్‌ టెస్టుల్లో భారత్‌ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కొవిడ్‌-19 పరీక్షల సంఖ్య 20 కోట్ల మైలు రాయిని దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం వెల్లడించింది. 

‘దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 20కోట్ల మైలు రాయిని దాటింది. వాటిలో 7.40లక్షల టెస్టులు గడిచిన 24 గంటల్లో చేసినవే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 2,369 టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఉండగా.. వాటిలో 1,214 ప్రభుత్వానివి కాగా.. మరో 1,155 ప్రైవేటు సంస్థలకు చెందినవి. ప్రయోగశాలల సామర్థ్యం మెరుగ్గా ఉన్నందువల్లే పరీక్షల సంఖ్య కూడా భారీగా పుంజుకుంది. అదేవిధంగా పరీక్షల సంఖ్య పెరగడం వల్లే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనా క్యుములేటివ్‌ పాజిటివిటీ రేటు 5.39శాతానికి చేరింది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.48లక్షలకు చేరింది. గత ఎనిమిది నెలల్లో దేశంలోని యాక్టివ్‌ కేసులు ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 95 మంది కరోనా కారణంగా మరణించారని’ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకుంటోంది. టీకా ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి శనివారం ఉదయం 8గంటల సమయానికి దేశవ్యాప్తంగా టీకా వేయించుకున్న వారి సంఖ్య 54 లక్షలకు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అత్యంత వేగంగా ఐదు మిలియన్ల మంది టీకా తీసుకున్న దేశంగానూ భారత్‌ రికార్డు సృష్టించింది. కేవలం 21 రోజుల్లోనే ఈ రికార్డు సాధించడం విశేషం. 

ఇదీ చదవండి

భారత్‌లో 50లక్షల మందికి టీకా పూర్తి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని