Corona: 21వేలు దాటిన కొత్తకేసులు.. లక్షన్నరకు చేరువైన బాధితులు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాస్త హెచ్చతగ్గులతో కొత్త కేసులు 20వేల పైనే నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 21వేలకు పైగా కేసులు రాగా.. పాజిటివిటీ రేటు

Published : 21 Jul 2022 10:00 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాస్త హెచ్చతగ్గులతో కొత్త కేసులు 20వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 21వేలకు పైగా కేసులు రాగా.. పాజిటివిటీ రేటు 4.25శాతంగా ఉంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రికవరీలు కూడా పెరుగుతుండటం మాత్రం సానుకూలాంశం.

కరోనా వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి..

* 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు - 5,07,360

* కొత్తగా నమోదైన కేసులు  - 21,566

* రోజువారీ పాజిటివిటీ రేటు - 4.25 శాతం

* 24 గంటల్లో కోలుకున్నవారు - 18,294 (మొత్తం రికవరీలు 4.31 కోట్లు)

* రికవరీ రేటు - 98.46 శాతం

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు - 1,48,881

* క్రియాశీల కేసుల రేటు - 0.34 శాతం

* 24 గంటల్లో మరణాలు - 45 (మొత్తం మరణాలు 5.25 లక్షలు)

*  24 గంటల్లో పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోసులు - 29.12 లక్షలు (పంపిణీ అయిన మొత్తం డోసులు 200.91 కోట్లు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని