corona cases: పార్లమెంట్‌లో కరోనా కలకలం

దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా పార్లమెంట్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో 350 మందికిపైగా సిబ్బంది కొవిడ్ బారినపడినట్లు తేలింది.

Updated : 08 Jan 2022 22:33 IST

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా పార్లమెంట్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో 350 మందికిపైగా సిబ్బంది కొవిడ్ బారినపడినట్లు తేలింది. దిల్లీలో శనివారం రికార్డు స్థాయిలో 20వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 79,746 శాంపిల్స్‌ పరీక్షించగా 20,181 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే, కొవిడ్‌ బాధితుల్లో 11,869మంది కోలుకోగా..ఏడుగురు మృతిచెందారు.  తాజా కేసులతో దిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 48,178కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 19.6గా నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని