China: డ్రాగన్‌ ఫ్రూట్‌లో వైరస్‌ జాడ.. చైనాలో సూపర్‌ మార్కెట్ల మూసివేత!

మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ‘జీరో కొవిడ్‌’ వ్యూహాన్ని అమలు చేస్తున్నా.. చైనాలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా పొరుగున ఉన్న వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న డ్రాగన్‌ ఫ్రూట్‌లలో వైరస్‌ జాడ బయటపడటం.. స్థానికంగా కలకలం రేపుతోంది...

Published : 06 Jan 2022 14:24 IST

బీజింగ్‌: మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ‘జీరో కొవిడ్‌’ వ్యూహాన్ని అమలు చేస్తున్నా.. అక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా పొరుగున ఉన్న వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న డ్రాగన్‌ ఫ్రూట్‌లలో వైరస్‌ జాడ బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక్కడి జెజియాంగ్‌, జియాంగ్‌షి ప్రావిన్స్‌ల్లోని దాదాపు తొమ్మిది నగరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌లలో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానికంగా సూపర్‌ మార్కెట్లను మూసివేశారు. దిగుమతి అయిన సరకులను ఎమర్జెన్సీ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. దీంతోపాటు సంబంధిత వ్యాపారులను క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. 

పండ్ల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతుందనడానికి బలమైన ఆధారాలు లేకున్నా.. స్థానికంగా ఆందోళనకరంగా మారుతున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా చైనా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనూ ఓ సారి ఇదే విధంగా వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న పండ్లలో వైరస్‌ జాడ కనిపించడంతో కొంతకాలం పాటు వాటిపై నిషేధం విధించారు. వచ్చే నెలలో బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ దృష్ట్యా చైనా వైరస్‌ నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇప్పటికే జియాన్, యనాన్‌ నగరాల్లో లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. తాజాగా హెనాన్ ప్రావిన్స్‌లోని యుజౌ నగరంలోనూ లక్షలాది మందిని ఇళ్లకే పరిమితం చేశారు. ప్రజారవాణాను నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని