Covid Deaths: కరోనా మరణమృదంగం.. గత వారంలోనే 21% పెరిగాయ్‌!

ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఉద్ధృతి ఇటీవల కాస్త తగ్గినట్టు ......

Updated : 28 Jul 2021 19:16 IST

డబ్ల్యూహెచ్‌వో వెల్లడి

జెనీవా: ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఉద్ధృతి ఇటీవల కాస్త తగ్గినట్టు కనబడినప్పటికీ కొత్త రూపాలతో విరుచుకుపడి అనేకమంది ప్రాణాల్ని బలితీసుకుంటోంది. గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా మరణాలు సంఖ్య 21శాతం పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అమెరికా, ఆగ్నేయాసియాలోనే దాదాపు 69 వేలకు పైగా మరణాలు నమోదైనట్టు పేర్కొంది. కరోనా కేసులు కూడా 8శాతం పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య దాదాపు 194 మిలియన్లకు చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

ఇదే ట్రెండ్‌ కొనసాగితే మాత్రం రాబోయే రెండు వారాల్లో మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 200 మిలియన్లు దాటేస్తుందని అంచనా వేసింది. యూరప్‌ మినహా అన్ని ప్రాంతాల్లోనూ కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నట్టు ప్రకటనలో పేర్కొంది. అమెరికా, బ్రెజిల్‌, ఇండోనేషియా, యూకే, భారత్‌లలోనే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని