ఐదు అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

Updated : 02 May 2021 09:25 IST

మొదలైన తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు  

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. వివిధ కారణాల వల్ల ఈసారి ఈ బ్యాలెట్లు గతసారి కంటే నాలుగురెట్లకు పైగా పెరిగాయి. వీటి లెక్క పూర్తయ్యాక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తెరవబోతున్నారు. బెంగాల్‌లో తృణమూల్‌- భాజపా మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోరు సాగిందని, మమతకు కాస్త మొగ్గు ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఈ మధ్యాహ్నానికి ఓటర్ల తీర్పు సరళి, సాయంత్రం 5 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

తిరుపతి లోక్‌సభ స్థానం..
తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. ఉప ఎన్నికలో మొత్తం 11,02,068 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీలైన వైకాపా నుంచి ఎం.గురుమూర్తి, తెదేపా నుంచి పనబాక లక్ష్మి, భాజపా తరఫున కె.రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతామోహన్‌ పోటీ చేశారు. వీరితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

నాగార్జునసాగర్‌..
దివంగత తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిలో జరిగిన నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభమైంది. నల్గొండలోని అర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. 41 మంది అభ్యర్థులు పోటీపడిన ఎన్నికల్లో తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన తరవాత గుర్రంపోడు మండలంలోని ఓట్లను లెక్కిస్తారు. ఈ సాయంత్రానికి విజేత ఎవరో తేలనుంది.

ఐదు అసెంబ్లీ స్థానాల్లో..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని