2025 నాటికి బిలియన్‌ టన్నుల CO2 తొలగించాలి!

భూతాపాన్ని తగ్గించడమే లక్ష్యంగా 2015లో పారిస్‌ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 190కిపైగా దేశాలు సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా, పారిస్‌ ఒప్పందం ప్రకారం.. భూతాపాన్ని నివారించడానికి

Published : 05 Jul 2021 01:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూతాపాన్ని తగ్గించడమే లక్ష్యంగా 2015లో పారిస్‌ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 190కిపైగా దేశాలు సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా, పారిస్‌ ఒప్పందం ప్రకారం.. భూతాపాన్ని నివారించడానికి 2025 నాటికి గాల్లోని కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించాల్సిన మొత్తంతో పోలిస్తే ప్రస్తుతం తొలగిస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉందని కొలిషన్‌ ఫర్‌ నెగటీవ్‌ ఎమిషన్‌, కన్సల్టెన్సీ ఫమ్‌ మెక్‌కిన్సే సంస్థలు వెల్లడించాయి.

పారిస్‌ ఒప్పందం లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ప్రపంచదేశాలన్నీ 2025నాటికి కనీసం ఒక బిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏటా బిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తొలగించాలని ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు చేపట్టిన ప్రాజెక్టులతో 2025 నాటికి కేవలం 150 మిలియన్‌ టన్నులు మాత్రమే తొలగించగలుతామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి.. మరింత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సూచించాయి. ప్రస్తుతం కర్బన ఉద్గారాల తొలగింపునకు ఉపయోగించే సాంకేతికత చాలా ఖరీదైనవిగా ఉన్నాయని, అయినా కర్బన ఉద్గారాల తొలగింపుపై చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని