Indian Army: సైన్యం చేతుల్లో దేశం సురక్షితం: రాజ్‌నాథ్‌

భారత సైన్యం చేతుల్లో దేశం పూర్తి సురక్షితంగా ఉందని.. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల జమ్మూ సైనిక స్థావరంపై...

Published : 05 Jul 2021 22:25 IST

 ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమన్న రక్షణశాఖ మంత్రి

కాన్పుర్‌: భారత సైన్యం చేతుల్లో దేశం పూర్తి సురక్షితంగా ఉందని.. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల జమ్మూ సైనిక స్థావరంపై డ్రోన్ల దాడిపై స్పందించిన ఆయన.. భవిష్యత్‌లో ఎటువంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని పునరుద్ఘాటించారు. ఇలాంటి సమయంలో డ్రోన్ల దాడి చేసే వారిని హెచ్చరించాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ డ్రోన్ల దాడిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈవిధంగా స్పందించారు.

ఇక రాజకీయాలపై మాట్లాడిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. కుల, మతాల ఆధారంగా భాజపా ఎన్నడూ రాజకీయాలు చేయలేదని అన్నారు. కేవలం న్యాయం, మానవత్వం ఆధారంగానే భాజపా రాజకీయాలు ఉంటాయన్నారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పనితీరుపైనా ఎలాంటి సందేహాలు అవసరం లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని