ప్రేమ బలం ఏమోగానీ.. నొప్పి తెలిసొచ్చింది!

ప్రేమ ఎలాంటి పిచ్చి పనులైనా చేయిస్తుందని ఉక్రెయిన్‌కు చెందిన ఓ జంటను చూస్తే తెలుస్తుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా అలెగ్జాండర్‌.. విక్టోరియా జంట తమ ప్రేమ బంధం ఎంత బలంగా ఉంటుందో నిరూపించుకోవడం కోసం ఇద్దరి చేతుల్ని గొలుసులతో కట్టేసుకున్నారు. మూడు

Published : 28 Feb 2021 21:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమ ఎలాంటి పిచ్చి పనులైనా చేయిస్తుందని ఉక్రెయిన్‌కు చెందిన ఓ జంటను చూస్తే తెలుస్తుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా అలెగ్జాండర్‌.. విక్టోరియా జంట తమ ప్రేమ బంధం ఎంత బలంగా ఉంటుందో నిరూపించుకోవడం కోసం ఇద్దరి చేతుల్ని గొలుసులతో కట్టేసుకున్నారు. మూడు నెలలపాటు ఇలా ఉంటామని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులు వీరిద్దరూ చాలా అన్యోన్యంగా, సంతోషంగా ఉన్నారు. కానీ, రెండు వారాలపాటు వారి చేతులు గొలుసులతో కట్టేసి ఉండటంతో చేతులకు దద్దుర్లు, మంటల మొదలయ్యాయట. విక్టోరియా చేతికి అల్సర్స్‌ వచ్చాయి. అల్సర్స్‌ నొప్పిని ఆమె భరించలేపోతుంది. అయింట్‌మెంట్‌ పెట్టినా ఫలితం లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. చాలాకాలం పాటు చర్మం.. ఇనుమును తాకి ఉండటంతో ఈ అల్సర్స్‌ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే చర్మంలో ఉండే కణజాలాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని, వెంటనే గొలుసు తొలగించాలని హెచ్చరించారు. దీంతో వారు తమ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని