భూమి అంచును చూసేందుకు వెళ్లి..!

భూమి గుండ్రంగా ఉంటుందని అందరికి తెలుసు. శాస్త్రీయంగా ఇది నిరూపితమైన విషయం. కానీ, ఇప్పటికి కొందరు భూమి బల్లపరుపుగా ఉంటుందని నమ్మేవారు ఉన్నారు. ఇందుకోసం అనేక రకాల వాదనలు వినిపిస్తుంటారు. ఇలాగే భూమి బల్లపరుపుగా ఉంటుందని నమ్మే

Published : 13 Sep 2020 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూమి గుండ్రంగా ఉంటుందని అందరికి తెలుసు. శాస్త్రీయంగా ఇది నిరూపితమైన విషయం. కానీ, ఇప్పటికీ కొందరు భూమి బల్లపరుపుగా ఉంటుందని నమ్మేవారు ఉన్నారు. ఇందుకోసం అనేక రకాల వాదనలు వినిపిస్తుంటారు. ఇలాగే భూమి బల్లపరుపుగా ఉంటుందని నమ్మే ఓ జంట అది నిరూపించడానికి ఇటీవల ఓ సాహసం చేయబోయి ప్రమాదంలో పడింది. అయితే ఓ వైద్యుడు వారిని సురక్షితంగా కాపాడారు. 

ఇటలీలోని వెనిస్‌కు చెందిన ఓ జంట భూమి గుండ్రంగా కాదు, బల్లపరుపుగా ఉంటుందని బలంగా నమ్ముతోంది. ఇది నిరూపించడం కోసం ప్రపంచం అంచును చూడాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. భూమి బల్లపరుపుగా ఉంటుందనే సిద్దాంతాన్ని నమ్మేవారు.. ప్రపంచం అంచు ‘లంపేడుసా’అనే ఐలాండ్‌ సమీపంలో ఉంటుందని నమ్ముతారు. లంపేడుసా ఐలాండ్‌.. ఇటలీకి చెందిన సిసిలి ఐలాండ్‌, ఉత్తర ఆఫ్రికా మధ్యలో ఉంటుంది. నిజానికి ఈ ప్రాంతాన్ని వలసదారులు అక్రమంగా యూరప్‌లోకి ప్రవేశించేందుకు ఉపయోగిస్తుంటారట. ఈ విషయం తెలియని జంట లంపేడుసా వెళ్లడానికి కొద్ది రోజుల కిందట తమ కారును అమ్మేసి పడవ కొనుక్కొని సముద్ర మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టారు. అయితే వీరు సాధారణ దిక్సూచిని ఉపయోగించడంతో సముద్ర ప్రయాణంలో సిసిలి సమీపంలోని ఉస్టికా ఐలాండ్‌ వద్ద దారి తప్పారు. 

దారి తప్పి, ఎటు వెళ్లాలో తెలియకుండా సముద్రంలో ప్రయాణిస్తున్న వారిని.. ఇటలీ ఆరోగ్యశాఖకు చెందిన నేవీ వైద్యుడు గుర్తించి కాపాడారు. కానీ, కరోనా.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ జంటను అధికారులు పలెర్మోలో క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు. అయితే అక్కడి నుంచి రెండు సార్లు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడి అధికారులు పట్టుకున్నారు. ఎట్టకేలకు రెండువారాలు ఐసోలేషన్‌లో ఉండేందుకు ఆ జంట అంగీకరించడంతో అధికారులు వారిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని