Deve Gowda: దేవెగౌడకు భారీ జరిమానా

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ. 2కోట్లు చెల్లించాలని న్యాయస్థానం

Updated : 22 Jun 2021 14:27 IST

బెంగళూరు: మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ.2కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 

2011 జూన్‌ 28న ‘గౌడర గర్జన’ పేరుతో ఓ కన్నడ ఛానల్‌లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌(ఎన్‌ఐసీఈ) ప్రాజెక్టుపై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్‌ కోర్టు.. ఎన్‌ఐసీఈ ఆరోపణల్లో నిజం ఉందని తేల్చింది. 

ఎన్‌ఐసీఈ ప్రాజెక్టును గతంలో కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టు తమ తీర్పుల్లో సమర్థించాయని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇది కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని తెలిపింది. అలాంటి ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమవుతుందని అభిప్రాయపడింది. కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ ఎన్‌ఐసీఈకి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని