Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసు.. జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ నిర్దోషి

దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి (JNU) చెందిన విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Published : 03 Dec 2022 19:46 IST

దిల్లీ: దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి (JNU) చెందిన విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఖలీద్‌తో పాటు మరో విద్యార్థి నేత ఖలీద్‌ సైఫీని సైతం నిర్దోషిగా పేర్కొంది. చాంద్‌బాగ్‌ అల్లర్ల కేసులో వారి ప్రమేయం లేదంటూ బెయిల్‌ మంజూరు చేసింది.

దిల్లీలో రాళ్లు రువ్విన ఘటనలో సంగ్రామ్‌ సింగ్‌ అనే కానిస్టేబుల్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లకు కుట్ర పన్నారన్న అభియోగాలు మోపారు. అయితే, అందుకు తగిన ఆధారాలు లేవంటూ దిల్లీ కోర్టు తాజాగా కొట్టివేసింది. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మధుకర్‌ పాండే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, ప్రస్తుతం వీరిపై ఉపా చట్టం కింద వేర్వేరు కేసులు నమోదై ఉన్నాయి. దీంతో ఇరువురూ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని