Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్‌

దిల్లీ మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేందర్‌సింగ్‌తోపాటు ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రులకు బెయిల్‌ మంజూరైంది.

Published : 03 Jan 2023 13:16 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేందర్‌సింగ్‌తోపాటు ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రులకు బెయిల్‌ మంజూరైంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ సందర్భంగా రౌస్‌ అవెన్యూ కోర్టు వారికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్‌ ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది.

మరోవైపు నిందితుల రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి న్యాయస్థానం నోటీసు ఇచ్చింది. ఇప్పటికే మరో ఇద్దరు నిందితులు విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లికి సీబీఐ నమోదు చేసిన కేసులో ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నవంబర్‌ 25న 10వేల పేజీలతో ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ తొలి ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని