Asaram Bapu: అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు
2013 నాటి అత్యాచార కేసులో దోషిగా తేలిన ఆశారాంకు మరోసారి జీవితఖైదు పడింది. ఈ మేరకు గుజరాత్ కోర్టు నేడు తీర్పు వెలువరించింది.
అహ్మదాబాద్: ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ (Asaram Bapu) మరో అత్యాచార కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు విధిస్తూ గుజరాత్ (Gujarat) కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా.. ఇప్పటికే ఆయన మరో రేప్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
దాదాపు పదేళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో గాంధీనగర్ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. 2013లో గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ (Asaram Bapu) ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య ఆశారాం తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో సుదీర్ఘ విచారణ విచారణ చేపట్టిన గాంధీనగర్ సెషన్స్ కోర్టు.. ఆశారాంను దోషిగా తేల్చుతూ నిన్న తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నేడు ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా.. గతంలో జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు. ఈ కేసులోనూ జీవితఖైదు పడటంతో 2018 నుంచి జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
General News
Hyderabad: విశ్రాంత ఐఏఎస్ అధికారికి మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా
-
India News
Amit Shah: బెంగాల్లో ఘర్షణలపై హోం మంత్రి అమిత్ షా ఆరా.. గవర్నర్‌కు ఫోన్
-
Sports News
GT vs CSK: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!