Covaxin: 2-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ సురక్షితమే : భారత్ బయోటెక్
ది లాన్సెట్ జర్నల్‌లో పరిశోధన పత్రం
దిల్లీ: కరోనా వైరస్‌ను నిరోధించడంలో రెండేళ్ల వయసు పైబడిన చిన్నారులతోపాటు యుక్తవయసు పిల్లలకోసం రూపొందించిన కొవాగ్జిన్ (Covaxin) టీకా సురక్షితమైనదని పరిశోధనల్లో రుజువైనట్లు భారత్ బయోటెక్ (Bharat Biotech) వెల్లడించింది. వైరస్‌ను తట్టుకోవడంతోపాటు మెరుగైన రోగనిరోధకతను కలిగి ఉన్నట్లు తుది దశ ప్రయోగాల్లో తేలిందని ప్రకటించింది. కొవాగ్జిన్ సురక్షిత, ప్రతిస్పందన, రోగనిరోధకత సామర్థ్యంపై జూన్ 2021 నుంచి సెప్టెంబర్ 2021 మధ్యకాలంలో జరిపిన రెండు, మూడో దశ ప్రయోగాల్లో సమర్థవంతమైన ఫలితాలు వచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన అధ్యయనం ది లాన్సెట్ (The Lancet) జర్నల్‌లోనూ ప్రచురితమైనట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
‘చిన్నారులకు వ్యాక్సిన్ సురక్షితమనే విషయం అత్యంత కీలకం. ఈ క్రమంలో పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఎంతో సురక్షితం, రోగనిరోధకత సామర్థ్యం ఉన్నట్లు రుజువయ్యిందని చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. దీంతో చిన్నారులు, పెద్దలకు సురక్షితమైన ప్రాథమిక, బూస్టర్ వ్యాక్సిన్లను అందించాలనే లక్ష్యాన్ని చేరుకున్నట్లయ్యింది. తద్వారా కొవాగ్జిన్ అంతర్జాతీయ వ్యాక్సిన్‌గా మారింది. భారత్‌లో ఇప్పటికే 5కోట్ల మంది చిన్నారులకు అందించగా.. అత్యంత సురక్షితమమేనని తేలింది’ అని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ కృష్టా ఎల్లా పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, చిన్నారులపై కొవాగ్జిన్ పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు గతేడాది అక్టోబర్‌లోనే అందజేసినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. ఇందులో భాగంగానే 6 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ అందించేందుకు అత్యవసర అనుమతి (Emergency Use) ఇచ్చినట్లు తెలిపింది. పరిశోధనల్లో ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగలేదని.. కేవలం 374 మందిలోనే స్వల్పమైనని కనిపించినట్లు తెలిపింది. ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి రావడం వంటి సాధారణ దుష్ప్రభావమే చాలా మందిలో కలిగినట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: నయన్- విఘ్నేశ్‌ల ‘హ్యాపీ’ సెల్ఫీ.. రాశీ ఖన్నా స్టైల్ చూశారా!
-
General News
KRMB: మా విజ్ఞప్తిని కృష్ణాబోర్డు తప్పుగా అర్థం చేసుకుంది: తెలంగాణ ఈఎన్సీ
-
Politics News
Munugode: కూసుకుంట్లకు మునుగోడు టికెట్ ఇస్తే ఓడిస్తాం: తెరాస అసమ్మతి నేతలు
-
Crime News
Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
-
Movies News
Ashwini Dutt: ఆ సినిమా చేసి నేనూ అరవింద్ రూ. 12 కోట్లు నష్టపోయాం: అశ్వనీదత్
-
Politics News
Munugode: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగనుంది: రాజగోపాల్‌రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!
- Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
- Fahadh Faasil MALIK Review: రివ్యూ: మాలిక్
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!
- Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Kalapuram: పవన్ కల్యాణ్ పరిచయం చేసిన ‘కళాపురం’.. ఆసక్తిగా ట్రైలర్