Covaxin: మూడోదశ ట్రయల్స్‌లో 77.8 శాతం సామర్థ్యం!
కరోనా నియంత్రణ కోసం ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా మూడో దశ క్లినికల్ ప్రయోగాల ఫలితాలు వచ్చేశాయి. కరోనా వైరస్‌పై ఈ టీకా 77.8శాతం
దిల్లీ: కరోనా నియంత్రణ కోసం ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా మూడో దశ క్లినికల్ ప్రయోగాల ఫలితాలు వచ్చేశాయి. కరోనా వైరస్‌పై ఈ టీకా 77.8 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాల సమాచారాన్ని భారత్ బయోటెక్ గతవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సమర్పించగా నిపుణుల కమిటీ నేడు ఆ వివరాలను సమీక్షించింది. ఈ టీకా మూడోదశ ప్రయోగాల్లో వైరస్‌పై 77.8శాతం ప్రభావం కనబరచినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఫలితాల ఆధారంగా కొవాగ్జిన్ టీకా పూర్తి సామర్థ్యం స్పష్టంగా వెల్లడికానుంది.
కొవాగ్జిన్‌ను భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ది చేశాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ పరీక్షల ఆధారంగా దేశంలో ఈ టీకా అత్యవసర వినియోగానికి ఈ ఏడాది జనవరిలో డీసీజీఐ అనుమతిలిచ్చింది. ఆ తర్వాత మూడో దశ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించిన భారత్ బయోటెక్ ఇప్పటికే రెండు సార్లు ఫేజ్ 3 ట్రయల్ మధ్యంతర పరిశీలన ఫలితాలను ప్రకటించింది. తొలి మధ్యంతర ఫలితాల్లో 81శాతం, రెండో మధ్యంతర పరిశీలన ఫలితాల్లో 78శాతం ప్రభావశీలత కనబరచినట్లు కంపెనీ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి