Covaxin: మూడోదశ ప్రయోగ ఫలితాలు జులైలో..!

కొవాగ్జిన్‌ మూడవదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

Published : 09 Jun 2021 21:37 IST

వెల్లడించిన భారత్‌ బయోటెక్‌

దిల్లీ: కొవాగ్జిన్‌ మూడవదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఈ డేటాను తొలుత సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO)కు సమర్పిస్తామని.. ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్‌కు అందిస్తామని తెలిపింది. మూడోదశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కొవాగ్జిన్‌ పూర్తి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది.

ఆ నివేదికలో లోపాలు..

కొవాగ్జిన్‌ కంటే కొవిషీల్ట్‌ టీకానే అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోందని ఓ జర్నల్‌లో ప్రచురితమైన నివేదికలో అనేక లోపాలున్నాయని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌ టీకాను కొవిషీల్డ్‌తో పోలుస్తూ ప్రచురించిన ఈ కథనంపై భారత్‌ బయోటెక్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకటి, రెండు డోసుల తర్వాత భారత్‌ బయోటెక్‌ టీకాలపై వెలువరించిన ఆ నివేదికలో చాలా లోపాలున్నాయని పేర్కొంది.

ఇక భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. డెల్టాతో పాటు బీటా వేరియంట్‌నూ కొవాగ్జిన్‌ టీకా సమర్థంగా ఎదుర్కొంటోందని ఈ అధ్యయనంలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని