వెలవెలబోతున్న కుంభమేళా ఘాట్లు

కరోనా ప్రభావం కంభమేళాపై కూడా పడింది. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళ వెలవెలబోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్‌ సర్కారు కొవిడ్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేస్తోంది....

Published : 03 Apr 2021 01:30 IST

హరిద్వార్‌: కరోనా ప్రభావం కుంభమేళాపై కూడా పడింది. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళ వెలవెలబోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్‌ సర్కారు కొవిడ్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేస్తోంది. తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మైకుల ద్వారా ప్రకటించడంతోపాటు ఘాట్ల వద్ద శానిటైజర్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కుంభమేళ పుణ్యస్నాణాలకు వచ్చే భక్తులు 72 గంటలలోపు తీసుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ సమర్పిస్తే కానీ అనుమతించడం లేదు. 

గతంలో కుంభమేళ ఘాట్లన్నీ రద్దీగా ఉండేవి. కానీ ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ఘాట్లలో భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. సాధారణంగా కుంభమేళ నాలుగు నెలలపాటు జరిగేది. కానీ కొవిడ్‌ కారణంగా ఈసారి నెలరోజులకే ముగించాలని ఉత్తరాఖండ్‌ సర్కారు నిర్ణయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని