Published : 19 Jan 2022 23:40 IST

Mask Fine: మాస్క్‌ ధరించని వారి నుంచి రూ.86 కోట్లు వసూలు

ముంబయి: ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌తో పాటు ఒమిక్రాన్‌ వ్యాప్తి రోజురోజుకీ వేగవంతం అవుతోంది. మాస్క్‌లు ధరించి ప్రాణాలను కాపాడుకోండి అంటూ ప్రభుత్వం, వైద్యాధికారులు పదేపదే హెచ్చరించినా పెడ చెవిన పెట్టిన వారు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కేసులు పెరుగుతున్నా నిర్లక్ష్యం చేసిన వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని వారి నుంచి మంగళవారం వరకూ బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) రూ.86,42,49,771 జరిమానా వసూలు చేసింది. ఒక ముంబయిలోనే రూ.69,03,69,971  వసూలు చేయడం గమనార్హం. ముంబయి పోలీస్‌, రైల్వే శాఖ ఈ జరిమానాను వసూలు చేశారు. ప్రస్తుతం ముంబయిలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 10లక్షలకు పైగా చేరుకుంది. ఇందులో 84శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. రికవరీ రేటు 94శాతం ఉంది. కాగా ముంబయిలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు సుమారుగా 80:20 నిష్పత్తిలో ఉన్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని