Published : 17 Sep 2021 01:42 IST

ICMR: గర్భిణుల్లో కొవిడ్‌ ఇన్పెక్షన్‌ ముప్పు ఎక్కువే!

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో ఇన్పెక్షన్‌ ముప్పు ఎక్కువని, ఈ క్రమంలో వారికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. గర్భిణుల్లో కరోనా ప్రతికూల ఫలితాలపై ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో అధ్యయనం జరిపింది.  ఆ రాష్ట్రంలోని పలు ఇన్సిస్టిట్యూట్‌లు, ఆసుపత్రుల సహకారంతో ఐసీఎంఆర్‌ మొదటిసారిగా సమగ్ర అధ్యయనం జరిపింది. మహారాష్ట్రలో కొవిడ్‌ సోకిన గర్భిణులు, బాలింతలపై సేకరించిన సమాచారంతో ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 4,203 మంది కరోనా సోకిన గర్భిణుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. మొత్తంగా చూస్తే.. 3,213 జననాలు, 77 గర్భస్రావాలు నమోదయ్యాయి. మొత్తం 528 మందికి ముందస్తు ప్రసవం అయింది. 328 మందిలో రక్తపోటు సమస్యలు తలెత్తాయి.  పిండ విచ్ఛిత్తి, మృత శిశువుల జననం నిష్పత్తి ఆరు శాతంగా ఉంది.

534 మందిలో లక్షణాలు..

మొత్తం గర్భిణుల్లో 534 మంది సింప్టమెటిక్‌గా తేలారు. వీరిలో 382 మందిలో తేలికపాటి, 112 మందిలో మధ్యస్థ, 40 మందిలో తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. మొత్తంగా 158 మంది గర్భిణులు, బాలింతలకు ఇంటెన్సివ్ కేర్ వైద్యం అవసరం అయింది. వీరిలో 152 మందికి కొవిడ్‌ సంబంధిత సమస్యలే కారణమయ్యాయి. మొత్తం మరణాల రేటు 0.8 శాతం(34/4203)గా నమోదైంది. పుణెలో(9/853, 1.1 శాతం), మరాఠ్వాడా(4/351, 1.1 శాతం) ప్రాంతాల్లో అధిక మరణాలు సంభవించాయి. ‘గర్భిణుల్లో వైరస్‌ లక్షణాలు కనిపించినప్పడు.. అవి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మహమ్మారి సోకిన గర్భిణులకు తక్షణ వైద్య సహాయం అవసరమ’ని ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని