Everestనూ తాకిన కరోనా

ఎరరెస్ట్ శిఖరం మీద మొట్టమొదటి కరోనా కేసు నమోదయ్యింది. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌లో నార్వేకు చెందిన పర్వతారోహకుడు ఎర్లెండ్‌ నెస్‌కు కరోనా సోకింది.

Updated : 23 Apr 2021 20:36 IST

కాఠ్‌మాండూ: ఎవరెస్ట్‌ శిఖరం మీద మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. అక్కడి బేస్‌ క్యాంప్‌లో నార్వేకు చెందిన పర్వతారోహకుడు ఎర్లెండ్‌ నెస్‌కు కరోనా సోకింది. అతడిని హెలికాప్టర్‌ ద్వారా కాఠ్‌మాండూ ఆస్పత్రి తరలించారు. ఎర్లెండ్‌ నెస్‌, ఏప్రిల్‌ 15న కరోనా టెస్టులు చేయించుకోగా కరోనా పాజివ్‌గా నిర్ధారణ అయ్యింది. గురువారం మరోసారి పరీక్షలు చేయగా ఫలితం నెగెటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి నేపాల్‌లో ఉంటున్నానని ఆయన తెలిపారు.

ఎవరెస్ట్‌, లోట్సే శిఖరాలను అధిరోహించే 18 మంది బృందానికి ఏస్‌ గైడ్‌, ఆస్ట్రియన్‌ లుకాస్‌ ఫుర్టెన్‌బాచ్‌ నాయకత్వం వహిస్తున్నారు. బేస్‌ క్యాంపుల్లోని ఉన్న వాళ్లందరికీ టెస్టులు చేయించాలని, నిర్లక్ష్యం చేస్తే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతాయిని ఫుర్టెన్‌బాచ్‌ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కరోనా యాక్టిక్‌ కేసులు లేవని నేపాల్‌ పర్వతారోహణ అధికారి వెల్లడించారు. కొవిడ్‌-19 కేసుల గురించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని, పర్వతాలమీద న్యుమోనియా, ఆల్టిట్యూడ్‌ ఇల్‌నెస్‌ వంటి అనారోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయని పర్వతారోహణ విభాగం డైరెక్టర్‌ మీరా ఆచార్య తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని