Corona Virus: కరోనా ఇంకా మన నెత్తిపై కత్తిలా వేలాడుతోంది!

కరోనా వైరస్‌ ముప్పు తొలగిపోలేదని, అది మన నెత్తిపై కత్తిలా ఇంకా వేలాడుతూనే ఉందని మహరాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.  పాల్గఢ్‌లో జిల్లా కలెక్టరేట్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయం,.....

Published : 19 Aug 2021 22:45 IST

పాల్ఘడ్‌: కరోనా వైరస్‌ ముప్పు తొలగిపోలేదని, అది మన నెత్తిపై కత్తిలా ఇంకా వేలాడుతూనే ఉందని మహరాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. పాల్ఘార్‌ జిల్లా కలెక్టరేట్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాల భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విరార్‌, వాసాయి ప్రాంతాల్లో ప్రభుత్వ ఆరోగ్య వసతులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ.. కొవిడ్‌తో ప్రాణనష్టాన్ని నివారించేందుకు కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడం మంచిదన్నారు.  వసతులను ప్రస్తావిస్తూ ఈ జిల్లా ఇతర జిల్లాలతో విభిన్నమైందన్నారు. ఇక్కడ అటవీ భూమితో పాటు తీర ప్రాంతం కలిగిన గిరిజన సాంస్కృతిక సంపద, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ముంబయి పక్కనే ఉన్నా చాలా కాలం పాటు నిర్లక్ష్యానికి గురైందని, ఇకముందు అలా జరగబోదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌, మంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, దాదా బుసె, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు