భారత్‌ తన సొంత డేటాతోనే పిల్లలకు టీకాపై నిర్ణయం తీసుకోవాలి..

చిన్నారులకు టీకా వేయటానికి భారత్‌కు సొంత డేటా ఉండాలని, అప్పుడే ఓ నిర్ణయానికి

Published : 08 Sep 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నారులకు టీకా వేయటానికి భారత్‌కు సొంత డేటా ఉండాలని, అప్పుడే ఓ నిర్ణయానికి రావాలని ప్రముఖ వైరాలజిస్ట్ గగన్దీప్ కంగ్ సూచించారు. ఎంత మంది పిల్లలు కరోనా వైరస్ బారినపడ్డారు, వారిలో ఎందరి పరిస్థితి తీవ్రంగా ఉంది, ఎందరు మరణించారనే విషయంలో చాలా తక్కువ అధ్యయనాలు జరిగినట్టు కంగ్‌ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్‌లోని కొన్ని దేశాల్లో 12ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తున్నప్పటికీ 12-15 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సిన్  వేయొద్దని బ్రిటన్ సలహా కమిటీ సూచించినట్లు గగన్ దీప్ కంగ్ చెప్పారు. భారత్‌లో చిన్నపిల్లలకు టీకా వేయటానికి ముందు వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూశాక నిర్ణయం తీసుకోవాలన్నారు. కొత్త వేరియంట్ బయటపడనంత వరకూ మూడోదశ  తీవ్రత రెండో దశ స్థాయిలో ఉండదని వెల్లడించారు. దేశంలో రోజురోజుకు టీకా పంపిణీ పెరుగుతోందని, ప్రజలు కరోనా బారినపడకుండా ప్రభుత్వం ఆ విషయంలో దృష్టి కేంద్రీకరించాలని  సూచించారు. మూడో దశకు సంబంధించి అనేక ఊహాగానాలు, అధ్యయనాలు వెలువడుతున్నాయని, అయితే ఆ డేటాకు సంబంధించిన ఇన్ పుట్స్ ఎక్కడినుంచి వస్తున్నాయో తనకు తెలియదని గగన్ దీప్ కంగ్ పేర్కొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు