Coronavirus:ఒక్కరోజులో 4లక్షలు దాటిన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి 4లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated : 06 May 2021 10:12 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. 4లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  ఒక్కరోజులో 3,29,113 మంది కోలుకున్నారు.

తాజా కేసులతో దేశంలో ఇప్పటి  వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,10,77,410కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2,30,168 మంది మరణించగా.. 1,72,80,844 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 16,25,13,339 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని