Corona: ముంబయిలో కొత్తగా6 వేల కేసులు.. 90 శాతంమందిలో లక్షణాల్లేవ్‌..!

రాజస్థాన్‌లో ఒమిక్రాన్‌ కలకలం రేపుతోంది. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో......

Published : 01 Jan 2022 23:16 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 5613 కేసులు రాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో 47,978 శాంపిల్స్‌ పరీక్షిస్తే 6,347 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,712 మందిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అలాగే, ఈ రోజు కొవిడ్‌తో ఒకరు మరణించగా.. మరో 451 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో నగరంలో క్రియాశీల కేసలు సంఖ్య 22,334కి పెరిగింది.


రాజస్థాన్‌లో భారీగా ఒమిక్రాన్‌ కేసులు

రాజస్థాన్‌లో ఒమిక్రాన్‌ కలకలం రేపుతోంది. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 52 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 121కి పెరిగింది. కొత్తగా వచ్చిన కేసుల్లో 38 ఒక్క జైపూర్‌ నగరం నుంచే రావడం గమనార్హం. అలాగే, ప్రతాప్‌గఢ్‌, శిరోహి, బికనేర్‌ నుంచి మూడు చొప్పున కొత్త వేరియంట్‌ కేసులు రాగా.. జోధ్‌పూర్‌ నుంచి రెండు, అజ్మేర్‌, సికర్‌, భిల్వారా నుంచి ఒక్కొక్కటి చొప్పున వెలుగు చూసినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్‌ బాధితుల్లో తొమ్మిది మంది విదేశాల నుంచి రాగా..  నలుగురు విదేశీ ప్రయాణికులతో కాంటాక్టు అయ్యారని, మరో 12 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. వీరందరినీ ఆర్‌యూహెచ్‌ఎస్‌ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఐసోలేట్‌ చేసినట్టు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 121 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 61 మంది కోలుకున్నట్టు తెలిపారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని