Corona effect: ఎయిరిండియాలో 56మంది ఉద్యోగులు మృతి

కరోనా మహమ్మారి సోకడంతో ఎయిరిండియాలో 56మంది ఉద్యోగులు మృతిచెందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోకి ఈ మహమ్మారి ప్రవేశించినప్పటి......

Published : 22 Jul 2021 17:50 IST

దిల్లీ: కరోనా మహమ్మారి సోకడంతో ఎయిరిండియాలో 56మంది ఉద్యోగులు మృతిచెందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఈ నెల 14 వరకు ఎయిరిండియాలో కొవిడ్‌ మృతుల వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 3523 మంది సిబ్బంది కొవిడ్‌ బారిన పడగా.. వీరిలో 56మందిని ఈ వైరస్‌ బలి తీసుకుందన్నారు. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు పలు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మృతి చెందిన ఒక్కో శాశ్వత ఉద్యోగి కుటుంబానికి రూ.10లక్షల చొప్పున, ఒప్పంద ఉద్యోగుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. కొవిడ్‌ సోకిన సిబ్బందికి వేతనంతో కూడిన 17 రోజుల క్వారంటైన్‌ సెలవును మంజూరు చేయడంతో పాటు వైద్య సదుపాయాలు కూడా కల్పించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని