Published : 13 Jun 2022 19:46 IST

Corona: కరోనా ఇంకా పోలేదు.. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ పెంచండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

దిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రెండు రోజులుగా 8వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, దిల్లీ ప్రధాన నగరాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. సుమారు రెండేళ్ల తర్వాత పాఠశాలలు సరైన సమయంలో పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం కరోనా కేసుల కట్టడికి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజాగా దీనిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనసుఖ్‌ మాండవీయ రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ పెంచాలని సూచించారు. అలాగే వృద్ధులకు ప్రికాషన్‌ డోసులను ఇవ్వాలని ఆదేశించారు. 

‘కరోనా ఇంకా సమసిపోలేదు. ప్రస్తుతం కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ పెంచండి. వృద్ధులకు ప్రికాషన్‌ డోసు ఇవ్వండి’ అని సమావేశంలో మంత్రి మాండవీయ రాష్ట్రాలకు సూచించారు. 

కాగా.. దేశంలో పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 47,995 క్రియాశీల కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 195 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ పూర్తయ్యిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని