
Winter Olympics: ‘వింటర్ ఒలింపిక్స్‌లో కొవిడ్ కేసులు తప్పవు.. అయినా సిద్ధమే!’
బీజింగ్: ‘ఒమిక్రాన్’ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ఒకవైపు అనేక దేశాలు ఆంక్షల బాట పడుతుండగా.. మరోవైపు ఫిబ్రవరిలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో చైనా ముందుకే వెళ్తోంది. వింటర్ ఒలింపిక్స్ బబుల్ లోపల కరోనా కేసులకూ సిద్ధంగా ఉన్నామని చైనా అధికారులు తాజాగా వెల్లడించారు. లక్షణాలు బయటపడిన అథ్లెట్లను బీజింగ్‌లోని ఎంపిక చేసిన ఆసుపత్రులకు తరలిస్తామని చెప్పారు. ‘ఒలింపిక్స్ సందర్భంగా కచ్చితంగా కేసులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో చిన్నపాటి క్లస్టర్లూ ఏర్పడొచ్చు’ అని బీజింగ్ ఒలింపిక్స్ వైరస్ నియంత్రణ అధికారి హువాంగ్ చున్ ఓ సమావేశంలో అన్నారు.
బూస్టర్ తీసుకుంటే మంచిది..
ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా అథ్లెట్లు, సిబ్బంది.. బూస్టర్ డోసు తీసుకుని వస్తే మంచిదని హువాంగ్ అన్నారు. బబుల్ లోపల అందరూ తప్పనిసరిగా రోజువారీ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అసింప్టమేటిక్‌గా తేలినవారిని ఆన్ సైట్ క్వారంటైన్ కేంద్రాలకు, లక్షణాలున్నవారిని ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు. ‘అథ్లెట్ల కోసం బీజింగ్‌లోని నాలుగు ఆసుపత్రుల్లో వార్డులు ఏర్పాటు చేశాం. అలాగే, మూడు ఒలింపిక్ వేదికల్లో మొత్తం 88 ఆన్ సైట్ కేంద్రాలను ఏర్పాటు చేశాం’ అని బీజింగ్ హెల్త్ కమిషన్ అధికారి లీ ఆంగ్ వెల్లడించారు.
జీరో కొవిడ్ వ్యూహంతో ముందుకు..
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పరిమిత సంఖ్యలో స్థానిక ప్రేక్షకులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. చప్పట్లు కొట్టేందుకు అవకాశం ఇస్తామని.. కానీ, మాస్కు తీసి అరవడం, పాటలు పాడటంపై ఆంక్షలు ఉంటాయన్నారు. వింటర్ ఒలింపిక్స్ నిర్వహణను చైనా సవాల్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానికంగా మహమ్మారి కట్టడి కోసం.. ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తక్కువ సంఖ్యలో కేసులు బయటపడినా.. లాక్డౌన్లు, భారీ ఎత్తున పరీక్షలు, కఠినమైన ఆంక్షలు విధిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
-
Business News
matrimony: ఐఏఎస్, ఐపీఎస్ కాదట.. మ్యాట్రీమొనీ సైట్లో వెతికింది వీరి కోసమేనట..!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
YS Sharmila: తెరాస కార్యకర్తలను అరెస్టు చేయాల్సిందే.. జోరువానలో షర్మిల దీక్ష
-
Sports News
PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
-
India News
Social Media: సోషల్ మీడియా జవాబుదారీగా ఉండాల్సిందే : స్పష్టం చేసిన కేంద్రమంత్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!