Third Wave: ‘దిల్లీ, ముంబయిలోనికొన్ని క్లస్టర్‌లలో మూడో వేవ్‌ షురూ!’

దేశ రాజధాని దిల్లీతోపాటు ముంబయిలోనూ కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. దిల్లీలో ఎల్లో అలర్ట్‌ సైతం జారీ చేశారు. తాజాగా ఈ రెండు నగరాల్లో కరోనా పరిస్థితులను విశ్లేషిస్తూ.. మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు...

Updated : 30 Dec 2021 19:51 IST

ముంబయి: దేశ రాజధాని దిల్లీతోపాటు ముంబయిలోనూ కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దిల్లీలో ఎల్లో అలర్ట్‌ సైతం జారీ చేశారు. తాజాగా ఈ రెండు నగరాల్లో కరోనా పరిస్థితులను విశ్లేషిస్తూ.. మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డా.రాహుల్‌ పండిత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. దిల్లీ, ముంబయిలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితులను చూస్తుంటే.. అక్కడి కొన్ని క్లస్టర్‌లలో మూడో వేవ్ ప్రారంభమైనట్లు చెప్పొచ్చని అన్నారు. ‘కేసుల రెట్టింపు రేటు.. ఒమిక్రాన్ వ్యాప్తిని సూచిస్తున్నాయి. అయితే, మొత్తం కేసుల్లో ఒమిక్రాన్‌ వాటాను గుర్తించేందుకు కొన్ని రోజుల జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇవి డెల్టా, ఒమిక్రాన్‌ కలగలిసిన కేసుల మాదిరిగా కనిపిస్తున్నాయి’ అని చెప్పారు.

స్థానికంగా నమోదవుతున్న కేసులు - ఆసుపత్రుల్లో చేరికల రేటును తేల్చేందుకు ఇంకా పది రోజులు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని డా.రాహుల్‌ అన్నారు. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా.. వైద్య వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినప్పుడు లాక్‌డౌన్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు. రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం గురించి మాట్లాడుతూ.. దీనికీ ప్రాముఖ్యం ఉందని, ప్రస్తుత కొవిడ్‌ తీవ్రత పరిస్థితులపై ఇది ప్రజలకు ఒక సందేశాన్ని పంపుతుందని వివరించారు. పౌరులంతా తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు