మా టీకా సురక్షితమే.. ఆస్ట్రాజెనెకా
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ
దిల్లీ: వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఖండించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని యూరప్‌లోని కొన్ని దేశాలు తాత్కాలికంగా నిలిపి వేస్తుండటంపై సంస్థ సోమవారం స్పందించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తంలో సమస్యలు ఏర్పడటానికి టీకాకు ఎటువంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతోందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చి చెప్పినట్లు ప్రకటించింది. దీంతో తమ వ్యాక్సిన్ అందరికీ సురక్షితమని సంస్థ వివరించింది.
‘ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ శాస్త్రీయంగా నిరూపితమైంది. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి.. టీకాను తయారు చేశాం. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటి వరకూ యూరప్, యూకేలలో సుమారు 17 మిలియన్‌ల మంది టీకా తీసుకున్నారు. ఇక ముందు కూడా ఎటువంటి సందేహం లేకుండా వ్యాక్సిన్ పొందవచ్చు. సాధారణ సమయంలోనూ రక్తంలో సమస్యలు ఏర్పడతాయి. వాటిని వ్యాక్సిన్‌తో ముడిపెట్టవద్దు. వ్యాక్సినేషన్ అనంతరం చాలా మందిలో రక్తం గడ్డకడుతోందని వస్తోన్న ఆరోపణలకు రుజువులు లేవు. నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్నాం. ఈ మేరకు టీకా నాణ్యతపై 20 లేబొరేటరీలలో 60 పరీక్షలు( క్వాలిటీ టెస్ట్‌లు) చేశారు’ అని ఆస్ట్రాజెనెకా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అన్ టేలర్ చెప్పారు. వ్యాక్సిన్ క్వాలిటీ టెస్ట్‌ల వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లలో పొందుపరుస్తామని సంస్థ తెలిపింది. భారత్‌లో ఆస్ట్రాజెనెకా టీకాను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను విజయవంతంగా పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
-
India News
Shah Rukh Khan: కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!
-
Movies News
Sharwanand: ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్ టీమ్ క్లారిటీ