కరోనా మృతుల్లో ఆ వయస్సు వారే అధికం!

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. గత కొంత కాలంగా నిత్యం 60వేలకు పైగా కేసులు నమోదువుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు........

Published : 26 Aug 2020 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. గత కొంత కాలంగా నిత్యం 60వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య అదే స్థాయిలో పెరగడం, మరణాల రేటు క్రమంగా తగ్గుతుండటం కొంతలో కొంత ఊరటనిచ్చే విషయం. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర కొవిడ్‌ మరణాలు చాలా తక్కువగానే ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.

భారత్‌లో నిన్న ఒక్కరోజే 848 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 58,390కి చేరింది. మొత్తం మృతుల్లో 69శాతం మంది పురుషులు కాగా.. 31శాతం మహిళలు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.8%గా ఉంది. 

కరోనా బారినపడి మృతిచెందిన వారి గణాంకాలను ఓసారి విశ్లేషిస్తే.. 60ఏళ్లకు పైబడినవారే అధికంగా ఈ వైరస్‌కు బలవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌‌ భూషణ్‌ వెల్లడించారు. కరోనా మృతుల్లో 60 ఏళ్లు ఆ పైబడిన వయస్సున్న వారే 51% ఉండగా.. 45 -60 ఏళ్ల మధ్య వయస్కులు 36%గా ఉన్నారు. అలాగే, 26 -44 ఏళ్ల మధ్య ఉన్నవారు 11%; 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులు 1%, 17 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారు 1%గా ఉన్నట్టు ఆయన తెలిపారు.


కరోనా రోగుల రికవరీ రేటు 76శాతానికి చేరువలో ఉంది. యాక్టివ్‌ కేసులతో పోలిస్తే రికవరీ అయినవారి సంఖ్య మూడింతల కంటే ఎక్కువే. 

దేశ వ్యాప్తంగా గడిచిన 25 రోజుల్లో కోలుకున్నారిలా.. (గ్రాఫ్‌)


కరోనా బారిన పడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో 2.70శాతం ఆక్సిజన్‌ సపోర్టుపై ఉండగా.. 1.92శాతం మంది ఐసీయూలో ఉండి చికిత్సపొందుతున్నారు. అలాగే, 0.29శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారు.


 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని