Australia: కొవిషీల్డ్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా.. అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు
భారత్‌లో అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవ్యాక్నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి ‘థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్’ సిఫార్సుల...
వెల్లడించిన ప్రధాని స్కాట్ మోరిసన్
కాన్బెర్రా: భారత్‌లో అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్‌నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి ‘థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్’ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయంతో సదరు టీకాలు పొందినవారు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. దీంతోపాటు నవంబరు నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మోరిసన్ ప్రకటించారు. అయితే, వ్యాక్సినేషన్ పూర్తయిన వారు.. తిరిగొచ్చాక వారంపాటు హోం క్వారంటైన్లో ఉండాలి. ఇంకా టీకా వేయించుకోనివారికి హోటల్లో 14 రోజులపాటు క్వారంటైన్ తప్పదు.
ఆంక్షలు సడలిస్తూ..
కరోనాకు ముందునాటి జీవితాలను తిరిగి పొందే విషయంలో ఆస్ట్రేలియన్లకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోరిసన్ వివరించారు. విదేశాలకు వెళ్లాలనుకునే ఆస్ట్రేలియన్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం ఇస్తామని, ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకూ తగినట్లు ఉంటుందని వివరించారు. కరోనా కట్టడికి ఆస్ట్రేలియా మొదటినుంచి కఠిన ఆంక్షలు, లాక్డౌన్లు విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ 80 శాతానికి చేరుకున్న నేపథ్యంలో క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. దేశ ఆదాయ వనరుల్లో ‘అంతర్జాతీయ విద్య’ కీలమైనది కావడంతో.. విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది ‘రాజకీయ ప్రతీకారమే’ అని స్పష్టంగా అర్థమవుతుందని ఆమ్ఆద్మీ పార్టీ పేర్కొంది. -
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్‌పోర్టులో ఆందోళనకర ఘటన
ఎయిర్‌పోర్టు(Airport)లో ఆగిఉన్న ఒక విమానాన్ని మరో విమానం ఢీకొంది. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమైంది. -
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
ఓ కండక్టర్ బస్సులోని మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో వైరలవడంతో అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. -
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించలేదు. -
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్ సిబ్బంది రెడీ!
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
India - Myanmar: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో 1600 కిలోమీటర్ల కంచె నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని సునీత వినిపించడంపై విమర్శలు గుప్పించిన భాజపా.. బిహార్‌లో రబ్రీ దేవి మాదిరిగా ఆమె కూడా మారనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది. -
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో
ఓ రాజకీయ నేతకు చెందిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన కరెన్సీ నోట్ల (Currency notes) పై హాయిగా నిద్రిస్తుండటమే కారణం. -
కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వర్గాల వెల్లడి
Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి. -
కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్ కేసు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. దీని విచారణకు సంబంధించి త్వరలో సమన్లు జారీ చేయనుంది. -
దిలీప్ ఘోష్‌కు భాజపా షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై వివరణ కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఘోష్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. -
నిరుద్యోగ సమస్యపై ‘సీఈఏ’ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
‘అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు’ అని ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం
Kejriwal arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన
Sunita Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెడతారని చెప్పారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం
Encounter: బీజాపుర్ జిల్లాలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్ ఫరూఖీ
బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ(Munawar Faruqui)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బిహార్‌లో ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్..
బిహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు - అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. -
ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు
ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసన.. పీహెచ్డీ డిగ్రీనీ వెనక్కి ఇచ్చేసిన సందీప్‌పాండే
దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు. -
భాజపా మాయ నుంచి యువత బయటకు రావాలి
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాజపా నిలబెట్టుకోలేదు. అబద్ధపు వాగ్దానం ఎందుకు చేశారని యువత ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తోంది. -
యూట్యూబ్ తొలగించిన వీడియోలు 22.5 లక్షలు
సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య యూట్యూబ్ తొలగించింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ సంచలనం.. ఐపీఎల్ రికార్డు బద్దలు
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి