ఎలర్జీ ఉంటే వ్యాక్సిన్‌ తీసుకోవద్దు: సీరం

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీలో వినియోగించిన రసాయన పదార్థాల వల్ల తీవ్ర అలర్జీలకు గురయ్యేవారు వ్యాక్సిన్‌ను తీసుకోకపోవడమే మంచిదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సూచించింది.

Updated : 20 Jan 2021 13:51 IST

దిల్లీ: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీలో వినియోగించిన రసాయన పదార్థాల వల్ల తీవ్ర అలర్జీలకు గురయ్యేవారు వ్యాక్సిన్‌ను తీసుకోకపోవడమే మంచిదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సూచించింది. ఆ సంస్థ విడుదల చేసిన ఫాక్ట్‌ షీట్‌ ప్రకారం..వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత ఎవరికైనా తీవ్ర అలర్జీ కలిగితే వారు ఆ తర్వాతి డోసును తీసుకోవద్దన్నారు. ఈ మేరకు వ్యాక్సిన్‌ పూర్తి వివరాలతో ఫాక్ట్‌ షీట్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ప్రజలు వ్యాక్సిన్‌ను తీసుకొనే ముందు ఆరోగ్య సిబ్బందికి తమ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను తెలపాలన్నారు. వారికి ఏవైనా అలర్జీలుంటే వాటి వివరాలు వెల్లడించాలని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకొనేవారికి జ్వరం, రక్త సమస్యలు ఉన్నా, గర్భిణులు అయినా ఆరోగ్య సిబ్బందికి ముందుగా సమాచారం అందించాలని తెలిపారు. అంతేకాకుండా ముందుగా ఏదైనా వేరే వ్యాక్సిన్‌ను తీసుకున్నా సిబ్బందికి తెలపాలని సీరం ఈ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికల ప్రకారం సోమవారం సాయంత్రానికి 3లక్షల 81వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు.

ఇవీ చదవండి..

లక్షద్వీప్‌నూ తాకిన కరోనా మహమ్మారి..

మురికి కుంట.. బారాన్‌కు సిరుల పంట


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని