Updated : 28/04/2021 18:23 IST

Vaccine ధర తగ్గించిన సీరం 

పుణె: కరోనా నివారణకు కొవిషీల్డ్‌ టీకాను అందిస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తున్న టీకా ధరలను 25% తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రాలకు ఇప్పటివరకు ఒక్కో డోసును రూ.400లకు విక్రయిస్తుండగా.. ఆ ధరను రూ.300లకు తగ్గిస్తున్నట్టు సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా ట్వీటర్‌లో వెల్లడించారు. తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. తమ నిర్ణయంతో రాష్ట్రాలకు రూ.వేల కోట్ల నిధులు ఆదా కావడంతో పాటు ఎక్కువ మంది వ్యాక్సిన్‌ వేయించుకొనేలా దోహదపడుతుందన్నారు. అలాగే, భారీ సంఖ్యలో ప్రాణాలను కాపాడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో టీకాకు వేర్వేరు ధరలు నిర్ణయించడంతో రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వ్యాక్సిన్‌ ధరలు తగ్గించాలంటూ టీకా తయారీ సంస్థలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని