Co-WIN: ఇక ప్రాంతీయ భాషల్లోనూ రిజిస్ట్రేషన్

కరోనా టీకా రిజిస్ట్రేషన్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొవిన్ పోర్టల్.. ఇప్పుడు హిందీతో సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది.

Updated : 04 Jun 2021 12:47 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా టీకా రిజిస్ట్రేషన్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొవిన్ పోర్టల్.. ఇప్పుడు హిందీతో సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేసినట్లు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

దేశంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదుచేసుకోవాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో ప్రజలు టీకా కేంద్రాల్లోని సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. దానివల్ల సిబ్బందిపై ఒత్తిడి పడుతుందని గుర్తించిన ప్రభుత్వం.. హిందీతో సహా పలు ప్రాంతీయ భాషల్లోకి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వారిపై ఒత్తిడి తగ్గడం వల్ల ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా జనవరిలో ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 22కోట్ల మందికిపైగా టీకాలు అందాయి.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts