Vaccine ధ్రువపత్రం, పాస్‌పోర్టుతో జత చేయండిలా..

వ్యాక్సిన్ పాస్‌పోర్టుపై ప్రపంచ దేశాలు యోచన చేస్తోన్న సమయంలో కేంద్రం విదేశీ ప్రయాణికులకు అనువుగా కొవిన్‌ పోర్టల్‌లో కొన్ని మార్పులు చేసింది.

Updated : 26 Jun 2021 18:10 IST

కొవిన్ పోర్టల్ ద్వారా వీలు కల్పించిన కేంద్రం

దిల్లీ: వ్యాక్సిన్ పాస్‌పోర్టుపై ప్రపంచ దేశాలు యోచన చేస్తోన్న సమయంలో కేంద్రం విదేశీ ప్రయాణికులకు అనువుగా కొవిన్‌ పోర్టల్‌లో కొన్ని మార్పులు చేసింది. పాస్‌పోర్టుకు కరోనా టీకా ధ్రువపత్రాన్ని జత చేసేలా వీలు కల్పించింది. ‘మీ టీకా ధ్రువపత్రంలో పాస్‌పోర్టు నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు’ అంటూ ఆరోగ్యసేతు అధికారిక ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించింది. 

అనుసంధానం ఇలా..

 మొదట కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి.

 అనంతరం ఖాతాదారుడి వివరాల దగ్గర ‘రైజ్ యాన్‌ ఇష్యూ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 

 పాస్‌పోర్టు ఆప్షన్‌పై క్లిక్‌ చేసి, డ్రాప్‌డౌన్‌ మెనూ నుంచి ఎవరి ధ్రువపత్రాన్ని లింక్‌ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. 

 పాస్‌పోర్టు నంబర్‌ను ఎంటర్‌ చేసి, సబ్‌మిట్‌ చేయాలి.

• ఒకవేళ టీకా ధ్రువపత్రంలోని పేరు పాస్‌పోర్టులోని పేరుతో సరిపోలకపోతే..ఎడిట్‌ చేసే సదుపాయం కూడా ఉంది. 

 అయితే పాస్‌పోర్టు నంబర్‌ ఎంటర్‌ చేయడం, పేరు మార్చుకునే సదుపాయం ఒక్కసారికి మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే సబ్‌మిట్‌ చేసే ముందే తప్పులు లేవని నిర్ధారించుకోవాలి.

కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొద్దిరోజుల క్రితం కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు, భారత్‌ తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే వారు టీకా ధ్రువపత్రాన్ని, పాస్‌పోర్టులకు అనుసంధానించుకోవాలని వెల్లడించింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని